బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా కీర్తి సురేశ్ .. భారీ మొత్తమే ఆఫర్ చేశారట!

  • ఓంకార్ తో బెల్లంకొండ శ్రీనివాస్
  • కథానాయికగా కీర్తి సురేశ్
  • పారితోషికంగా భారీ మొత్తమే  
బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి నుంచి కూడా కథానాయికల విషయంలో ఎంతమాత్రం వెనక్కి తగ్గలేదు. మొదటి సినిమా నుంచి కూడా తన సరసన స్టార్ హీరోయిన్స్ నటించేలా ఆయన ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. 'జయ జానకి నాయక' సినిమాలో రకుల్ తో కలిసి సందడి చేసిన ఆయన, ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో పూజా హెగ్డేతో కలిసి నటిస్తున్నాడు.

ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంటూ ఉండగానే, ఆయన తన తదుపరి సినిమాకి సన్నాహాలు చేసుకుంటున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తో స్పోర్ట్స్ నేపథ్యంలో ఓంకార్ ఒక సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్ ను సంప్రదించారట. 1కోటి 25 లక్షలను పారితోషికంగా ఇవ్వడానికి సిద్ధపడ్డారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.   
Go Back to Shorts
srinivas
keerti suresh

More Telugu News